శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (17:38 IST)

3 నెలల పసికందుపై 17 ఏళ్ల బాలుడి అత్యాచారం..

పసికందులను కూడా కామాంధులు విడిచిపెట్టట్లేదు. మూడు నెలల శిశువుపై అత్యాచారం చేసినందుకు 17 ఏళ్ల బాలుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ కేసులో బాలుడు పరారీలో ఉన్నాడు. తన తల్లి తన ఫిర్యాదులో, తన గేదెలను కట్టేందుకు వెళ్లానని.. ఆ సమయంలో నిద్రిస్తున్న కూతురిపై అత్యాచారం జరిగిందని వాపోయింది. 
 
ఆ నిద్రిస్తున్న 3 నెలల పసిబిడ్డ వద్ద 17 ఏళ్ల యువకుడు వున్నాడని.. ఏడుస్తున్న శిశువును శాంతింపజేయడానికి ప్రయత్నించడాన్ని ఆమె వెల్లడించింది. శిశువు ప్రైవేట్ భాగాలలో రక్తం కనిపించింది. శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
 
ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, బాలుడిపై ఐపిసి సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బాలుడిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.