శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (11:29 IST)

ఆట్లాడుకుంటూ పామును కొరికి చంపేసిన బాలుడు.. ఎక్కడ?

Snake
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలుడు... ఆట్లాడుకుంటూ పామును కొరికేయడంతో అది చనిపోయింది. బాలుడికి సకాలంలో వైద్యం అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఫరూకాబాద్ జిల్లాలోని కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్ సింగ్ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు శనివారం ఆరు బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అటుగా ఓ పాము వచ్చింది. 
 
దాన్ని చూసిన బాలుడు.. ఆట్లాడుకుంటూ వెళ్లి దాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి  పడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.