శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (14:14 IST)

మూడేళ్ల బాలికపై సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచారం.. ఏడుపు విని..?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నా.. కఠినమైన శిక్షలను తెచ్చేందుకు చట్టంలో సవరణలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. తాజాగా ఢిల్లీలో ఇంటికి కాపలా కాసే సెక్యూరిటీ గార్డ్.. ఆ ఇంట్లో ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగే చిన్నారిని కాటేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌లో.. రంజీత్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రంజీత్ అనే భవనంలో ఉన్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ సమయంలో బాలిక ఏడుపును గమనించిన స్థానికులు రంజీత్‌కు దేహశుద్ధి చేశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
మరోవైపు ఈ అత్యాచార ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ ఫైర్ అయ్యారు. నిర్భయ ఘటన చోటు చేసుకుని ఆరేళ్లైనప్పటికీ దేశ రాజధానిలో ఇంకా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని స్వాతి మండిపడ్డారు.