ముంబైలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం..

girl
girl
సెల్వి| Last Updated: శనివారం, 21 నవంబరు 2020 (16:41 IST)
ముంబైలో మరో దారుణం చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. ఇద్దరు మైనర్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఓ మహిళ తన మూడు సంవత్సరాల పాప గ్యాంగ్ రేప్‌కు గురైందని పోలీసుల్ని ఆశ్రయించిందని, ఇద్దరు మైనర్లు దీనికి పాల్పడినట్లు ఆమె చెప్పిందని దాంతో కేసును నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

ఈ కేసును ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 376, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పాక్సో) చట్టం ప్రకారం కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరు కరెక్షనల్ హోమ్‌కు తరలించ బడ్డారని ఇన్‌స్పెక్టర్ కాస్తుర్బా మార్గ్ తెలిపారు. అయితే నిందితులు ఇద్దరు బాధితురాలి కుటుంబానికి తెలిసిన వారేనని పోలీసులు చెప్పారు.దీనిపై మరింత చదవండి :