గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (14:19 IST)

నదిలో పడిన ఆయిల్ ట్యాంకర్.. నలుగురు మృతి

Gas Tanker Explosion
ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఒడియాలోని నయాగఢ్‌ జిల్లాలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ఆయిల్‌ ట్యాంకర్‌.. పారదీప్‌ నుంచి నయాగఢ్‌ వెళ్తుండగా.. నయాగఢ్‌ జిల్లాలోని ఇటామటి వద్ద ఉన్న పండుసురా వంతెన వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయింది.
 
ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ట్యాంకర్‌లో ఉన్న నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కటక్‌ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు చెప్పారు. తద్వారా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.