మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (13:36 IST)

Kolkata: బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం: కోల్‌కతా వద్ద రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

earthquake
బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ఈ ప్రకంపనలు నమోదైనాయి. ఈ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను ప్రభావితం చేశాయి. కోల్‌కతాకు నైరుతి దిశగా 109 కిలోమీటర్లు, ఒడిశాకు ఈశాన్యంగా 175 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయ్యింది. 
 
తొలుత సునామీ హెచ్చరికలు వస్తాయని భావించినా, అధికారికంగా అలాంటి అనుమానాలు లేవని చెప్పడంతో సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదు. 
 
మత్స్యకారులు సముద్రం ముందుకు రావడం వల్ల ఆందోళన చెందారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలపై ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.