శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జులై 2023 (16:23 IST)

అనుమానిత ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఎక్కడ?

crime scene
బెంగళూరులో అనుమానిత ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందింది. అరెస్ట్‌ అయిన వారిని జునైద్‌, సోహైల్‌, ముదాసిర్‌, ఉమర్‌, జాహిద్‌గా గుర్తించారు. 
 
వీరి నుంచి సెల్‌ ఫోన్లు, పేలుడు పదార్థాలతోపాటు ఇతర వస్తులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయిన నిందితులు 2017లో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వీరు ఉగ్రవాదుల పరిచయంతో శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.