శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (20:59 IST)

ప్రముఖ నిర్మాత కేసీఎన్ మోహన్ మృతి

KCN Mohan
KCN Mohan
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత కేసీఎన్ మోహన్ మృతి చెందారు. బెంగళూరులోని  నివాసంలో మోహన్ కన్నుమూశారు. కేసీఎన్ మోహన్ మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
కేసీఎన్ మోహన్ మరణంపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కేసీఎన్ మోహన్‌కు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూసినట్లు సమాచారం. 
 
గతేడాది ఆయన సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ మృతి చెందారు. ఆ లోటు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కుటుంబ సభ్యులకు.. కేసీఎన్ మోహన్ మరణం మళ్లీ విషాదాన్ని మిగిల్చింది.