1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ఎన్టీఆర్ - ఏఎన్నార్ - చిరంజీవి - వాణిశ్రీలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన కృష్ణ

Costumes Krishna
అనారోగ్యంతో బాధపుడుతూ చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన కాస్ట్యూమ్ డిజైనర్ కాస్ట్యూమ్ కృష్ణ... అనేక మంది అగ్ర నటీనటులకు డిజైనర్‌గా పని చేశారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో జన్మించిని కృష్మ.. సినినా రంగంపై ఉన్న ప్రేమతో ఆయన ఈ రంగంలోకి ప్రవేశించారు. తొలుతు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ బ్యానరులో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన ఆయన... ఆ తర్వాత నటుడుగా, నిర్మాతగా రాణించారు. 
 
ముఖ్యంగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా తన కెరీర్ మొదలుపెట్టిన కొత్తల్లో అగ్రనటులు ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నారు, చిరంజీవి వంటివారితో పాటు సీనియర్ నటీమణులైన వాణీశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్లకు డిజైనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించడంతో పలు చిత్రాల్లో విలన్‌గా, సహాయక నటుడిగా నటించి, ప్రేక్షకులను మెప్పించారు.