శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (08:06 IST)

కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం.. సతీమణి జయలక్ష్మి ఇకలేరు..

jayalakshmi
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శక దిగ్గజం, కళాతపస్వి దివంగత కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం నెలకొంది. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి(86) ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె తన భర్త చనిపోయిన 24 రోజులకే ఆమె కూడా శివైక్యం చెందారు. 
 
హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. ఆదివారం సాయంత్రం 6.15 గంటల సమయంలో నిద్రలోనే కన్నుమూశారని కుటుంబ సభ్యు్లు వెల్లడించారు. తమ ఇంటి పెద్ద విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
విశ్వనాథ్ పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఆయన నగరానికి చేరుకున్న తర్వాత అంత్యక్రియలను స్థానిక పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. కాగా, విశ్వనాథ్‌ను జయలక్ష్మి తన 15 యేళ్ల వయసులోనే వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా, ఈ నెల 2వ తేదీన అనారోగ్యం కారణంగా విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెల్సిందే.