బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (17:51 IST)

15 ఏళ్ల బాలికపై కాలేజీ యువకుల అత్యాచారం.. వీడియో తీసి..?

మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఒక మైనర్ బాలికను ఆరుగురు మైనర్ బాలురు సాముహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ధార్వాడ్ జిల్లాలో నివాసముండే ఒక 15 ఏళ్ల బాలిక పదవ తరగతి చదువుతోంది. ఈ బాలికను స్కూలుకు వెళ్లి వస్తుండగా.. మార్గ మధ్యంలో 17 ఏళ్ల వయసున్న ఆరుగురు కాలేజ్ యువకులు పరిచయమయ్యారు. 
 
ఈ పరిచయంతో ఆ బాలికపై ఆ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై వీడియో తీసి బెదిరించసాగారు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని మూడు నెలల్లో ఆరుగురు, ఆరు చోట్ల బాలికపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ వేధింపులను తాళలేక బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వెంటనే వారు పోలీసుల వద్దకు చేరుకొని ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్దనున్న వీడియోలను డిలీట్ చేశారు.