సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. ఓవర్ స్పీడ్‌తో కారు నడిపింది.. బాలుడిని చంపేసిన మహిళా ప్రొఫెసర్
సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఇష్టా రాజ్యంగా కార్లు నడపటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. తాజాగా ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పదేళ్ల బాలుడి ప్రాణాలని గాల్లో కలిపేసింది ఓ మహిళా ఫ్రొఫెసర్. ఈ విషాద ఘ
సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఇష్టా రాజ్యంగా కార్లు నడపటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. తాజాగా ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పదేళ్ల బాలుడి ప్రాణాలని గాల్లో కలిపేసింది ఓ మహిళా ఫ్రొఫెసర్. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని నజాఫ్గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఆ వివరాలను పరిశీలిస్తే... ఆల్టో కారులో వెళుతున్న అనుపమ మహిళా ఫ్రొఫెసర్ ఫోన్ మాట్లాడుతూ... సైకిల్ పై వెళుతున్న నితీశ్ మాన్ (9) అనే బాలుడిని ఢీకొట్టింది. వేగంగా నడుపుతున్న కారును ఆపలేకపోవడంతో నితీశ్‌ను కొంత దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో నితేశ్ కుప్పకూలి పడిపోయాడు.
అనంతరం కారు నుంచి దిగిన ఆ మహిళ ఆమె కారులోనే బాలుడిని ఆస్పత్రికి తరలించింది. కాని తీవ్ర రక్తగాయాలు కావడంతో అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. తన సోదరికి నూడుల్స్ తెచ్చేందుకు నితీశ్ బయటకి వెళ్లినప్పుడే ఈ ఘోరం జరిగిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితురాలు అనుపమ అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడిచిపెట్టారు.