శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (11:29 IST)

వడోదర పంట పొలాల్లో మొసలి.. వీడియో వైరల్ (video)

crocodile
గుజరాత్ వడోదరలోని ఓ గ్రామంలోని పంట పొలాల్లో మొసలి కనిపించింది. దీంతో జనాలు జడుసుకున్నారు. సాధారణంగా మొసళ్లు, నదులు, పెద్ద చెరువుల్లో సంచరిస్తాయి. కానీ పంట పొలాల్లో మొసలి కనిపించడంతో ప్రజలు జడుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వడోదరాలో కేలన్పూర్ గ్రామంలోని పంట పొలాల్లో ఈ మొసలి కనిపించింది. 
 
దాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అదించారు. మొసళ్లను పట్టే ఫారెస్ట్ రెస్క్యూ బృందం కేలన్పూర్‌కు చేరుకొని మొసలిని పట్టుకున్నారు. చాలా శ్రమపడి ఎట్టకేలకు రెస్క్యూ బృందం మొసలిని పట్టుకొని బంధించి గుజరాత్‌ ఆటవీశాఖ ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను ''మై వడోదరా'' ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో‌ ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.