బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Preeti
Last Modified: మంగళవారం, 25 జులై 2017 (19:54 IST)

సిగరెట్‌కు మరో 2 రూపాయలు చెల్లించమన్నందుకు కత్తితో పొడిచేసాడు...

సోమవారం సాయంత్రం లూథియానాలో ఒక అపరిచిత వ్యక్తి రెండు రూపాయల విషయంలో గొడవ జరిగి బడ్డీకోట్లో సిగరెట్లు అమ్మే వ్యక్తిని కత్తితో పొడిచేసాడు. గాయాలపాలైన వ్యక్తిని రోహిత్‌గా గుర్తించారు. బడ్డీకొట్టు యజమాని అయిన సునీల్ కుమార్ కథనం మేరకు సోమవారం సాయంత్రం తనక

సోమవారం సాయంత్రం లూథియానాలో ఒక అపరిచిత వ్యక్తి రెండు రూపాయల విషయంలో గొడవ జరిగి బడ్డీకోట్లో సిగరెట్లు అమ్మే వ్యక్తిని కత్తితో పొడిచేసాడు. గాయాలపాలైన వ్యక్తిని రోహిత్‌గా గుర్తించారు. బడ్డీకొట్టు యజమాని అయిన సునీల్ కుమార్ కథనం మేరకు సోమవారం సాయంత్రం తనకు కొట్టులో సహాయంగా ఉండేందుకు తన బావమరిది వచ్చాడు. 
 
ఆ సమయంలో ఒక కస్టమర్ వచ్చి సిగరెట్టు కొని పది రూపాయలు ఇచ్చాడు, అప్పుడు రోహిత్ మరో 2 రూపాయలు ఇవ్వాల్సిందిగా కస్టమర్‌ను కోరారు. కానీ కస్టమర్ దీనికి నిరాకరించగా వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ కోపంలో కస్టమర్ రోహిత్‌ను పొడిచేసి, అక్కడి నుండి పారిపోయాడు. రోహిత్‌ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.