శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (09:40 IST)

అనుమానంతో భార్య తల నరికి పోలీసు స్టేషనుకు తెచ్చాడు...

కర్నాటక రాష్ట్రం చిక్బళ్లాపురం మురుగుమళ్ళ సమీపంలో ఘోరం జరిగింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య తల నరికి, ఆ నరికిన తలతో 30 కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణం చేసి శ్రీనివాసపురం పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగి

కర్నాటక రాష్ట్రం చిక్బళ్లాపురం మురుగుమళ్ళ సమీపంలో ఘోరం జరిగింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య తల నరికి, ఆ నరికిన తలతో 30 కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణం చేసి శ్రీనివాసపురం పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు.
 
సద్దాం మొదటి భార్యను వదిలేసి 8 నెలల క్రితమే రోషినిని రెండో వివాహం చేసుకున్నాడు. కోలార్ జిల్లాలో మూడు వారాల క్రితం షిమోగాలో ఇదే తరహాలో ఓ భర్త తన భార్య తల నరికి ఆ తల తీసుకువచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇప్పుడ సద్దాం కూడా భార్య తల నరికి పోలీసుల ముందు లొంగిపోయాడు. నెల రోజుల వ్యవధి లోపే ఒకే తరహాలో రెండు ఘటనలు జరగడం చర్చనీయాంశంగా మారింది.