రూపాయికే చీర.. నోట్ల రద్దుకు మద్దతుగా బీదర్‌లో వ్యాపారం.. పోటెత్తుతున్న మహిళలు
ఓవైపు నోట్ల కష్టం. ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అయితే దేశంలో నల్లదనం నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దుకు మద్దతుగా తాము అతి తక్కువ ధరకే చీరల అమ్మకాలు చేపట్టామని ఓ బీదర్ వ్యాప
ఓవైపు నోట్ల కష్టం. ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అయితే దేశంలో నల్లదనం నిర్మూలనకు ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దుకు మద్దతుగా తాము అతి తక్కువ ధరకే చీరల అమ్మకాలు చేపట్టామని ఓ బీదర్ వ్యాపారి భావించాడు. ఇందులో భాగంగా రూ.1కే చీర అమ్మడం మొదలుపెట్టాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంత చౌకగా చీరలు దొరికే సరికి సదరు దుకాణం వద్దకు పోటెత్తారు.
చాలామంది తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. పోటెత్తిన మహిళలను అదుపు చేయడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇదంతా కర్నాటక జిల్లాలోని బీదర్‌లో జరిగింది. అక్కడి జిల్లా ఆసుపత్రి సమీపంలో సృష్టి-దృష్టి అనే చీరాల దుకాణం ఉంది. ఈనెల 16 నుంచి ఈ దుకాణంలో చీరల అమ్మకాలు మొదలయ్యాయి.
రూపాయి, రెండ్రూపాయలకే చీరలు అమ్మనున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో మహిళల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ విక్రయాలు ఈనెల 26 వరకు సాగనున్నాయి. ఈ వ్యాపారం కోసం లక్ష చీరలు తెప్పించామని, రూపాయికే చీర అనగానే చాలామంది రూపాయి నాణెం ఇవ్వజూపుతున్నారని దుకాణపు అధికారులు తెలిపారు. కానీ తాము మాత్రం రూపాయి నోటు ఇచ్చినవారికే చీర అమ్ముతున్నామని సృష్టి-దృష్టి షోరూం యజమాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.