బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (09:14 IST)

ప్రేమికుడితో బీచ్‌కు వెళ్తే.. లారీ డ్రైవర్ అత్యాచారం.. ఫోనులో బంధించి..

rape
మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. భర్త, సోదరుడు, ప్రేమికుడు పక్కనున్నా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రేమికుడితో కలిసి సూరత్కల్‌ బీచ్‌కు వచ్చిన ఓ యువతి (23)పై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన మునాజ్‌ అహ్మద్‌ అనే లారీ డ్రైవర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. జులై 27న సముద్రతీరంలో ఆ ప్రేమికులను మునాజ్‌ అడ్డగించాడు. మరో మతానికి చెందిన యువకునితో ఎందుకు తిరుగుతున్నావంటూ బెదిరించాడు. ఆ యువకునిపై దాడి చేసి లారీకి తాడుతో కట్టేశాడు. ఆమెకు మారణాయుధాలు చూపి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు.
 
అత్యాచార ఘటనను తన స్మార్ట్ ఫోన్ కెమెరాతో రికార్డు చేసుకున్నాడని పోలీసు అధికారులు గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్టు చేశారు.