గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (10:04 IST)

18 మందిని పెళ్లాడిన యువతి.. ఎక్కడ?

తన మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం.. ఆపై నగదు, నగలతో పరారు కావడం.. భాగ్‌వతి అలియాస్‌ అంజలికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఇప్పటి వరకు ఒకరి తరువాత ఒకరిని ఏకంగా 18 మందిని పెళ్లాడి వారిని మోసం చేసింది.

చివరికి రాజస్తాన్‌ పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. తెలుగు రాష్ట్రాలకు చెందినట్టుగా భావిస్తున్న అంజలి మరో ఐదుగురితో కలిసి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో పలువురిని మోసగించింది. జునాగఢ్‌ పరిధిలో ఉండే అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడిన అంజలి.. నగలు, రూ.3 లక్షల నగదుతో పరారైంది.

తాను మోసపోయినట్టు తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంజలి బాగోతం బయటకు వచ్చింది. మారు పేరు, నకిలీ ధ్రువపత్రాలతో ఆమె గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

అంజలితోపాటు మరో ఐదుగురిని కటకటాల వెనక్కి పంపారు. విచారణలో ఆమె 18 మంది యువకులను పెళ్లాడినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.