ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (13:48 IST)

పంజాబ్‌లో దారుణం : జిమ్‌లో ఆప్ కౌన్సిలర్ కాల్చివేత

gunshot
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జిమ్ లోపల్ ఆప్ కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపారు. పంజాబ్ రాష్ట్రంలోని మలెర్‌కోట్ల జిల్లాలోని ఓ జిమ్‌ లోపల ఈ దారుణ ఘటన జరిగింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఆప్ కౌన్సిలర్ అహ్మద్ అక్బర్‌పై ఓ దండగుడు జిమ్‌లోకి చొచ్చుకుని వచ్చి కాల్పులు జరిపారు. 
 
దీంతో అక్బర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా ఎస్పీ అవనీత్ కౌర్ వెల్లడించారు. శరీరంలోకి తూటా దూసుకెళ్లగానే కుప్పకూలి ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. వ్యక్తిగత కక్షతోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, ఈ విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.