శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (08:47 IST)

శారీరక సంబంధం పెట్టుకోమని మరదలిని ఒత్తిడి చేసిన ఆప్ ఎమ్మెల్యే.. అరెస్టు

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే లైంగిక వేధింపుల కేసులో జైలుపాలయ్యాడు. శారీరక సంబంధం పెట్టుకోవాలని స్వయంగా ఆయన మరదలినే ఒత్తిడి చేసి చిక్కుల్లో పడ్

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే లైంగిక వేధింపుల కేసులో జైలుపాలయ్యాడు. శారీరక సంబంధం పెట్టుకోవాలని స్వయంగా ఆయన మరదలినే ఒత్తిడి చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ, ఒఖ్లా నియోజకవర్గం ఎమ్మెల్యేగా అమానతుల్లా ఖాన్ కొనసాగుతున్నారు. ఈయనపై ఆయన మరదలు జామియా నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేసింది. తనపై ఖాన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, శారరీక సంబంధం పెట్టుకోమని ఆయన తనను బలవంత పెట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
సాకేత్‌ కోర్టులో ఆమె వాంగ్మూలం కూడా ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అమానతుల్లా ఖాన్‌‌ను అరెస్టుచేశారు. ఈ కేసు నేపథ్యంలో అమానతుల్లా ఖాన్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. ఇప్పటికే ఢిల్లీ మంత్రి సందీప్‌ కుమార్‌ మహిళలతో రాసలీలలు జరుపుతున్న అశ్లీల వీడియో సీడీ వెలుగుచూడటంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.