శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 3 జనవరి 2020 (17:57 IST)

ప్రియుడితో భార్య రొమాన్స్.. భర్త తలుపులు కొట్టడంతో?

అక్రమ సంబందానికి మరో ప్రాణం పోయింది. కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపేసింది భార్య. అది కూడా ప్రియుడితో కలిసి. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడమే కాకుండా అది బయటకు రాకుండా జాగ్రత్త పడింది. కానీ చివరకు భర్తకు తెలియడం, అది కూడా ప్రియుడితో మంచంపై ఉండటం చూసిన భర్తకు ఏం చెప్పాలో తెలియక చంపేసింది. 
 
ఒడిశాలోని రాయగడజిల్లాలోని మునిగుడకు చెందిన రాజ్ కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య నివేదిత, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. నివేదిత మునిగుడ తహశీల్దార్ కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తోంది. అయితే నివేదిత మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రెండు రోజుల క్రితం పని మీద బయటకు వెళ్ళాడు భర్త.
 
ఇద్దరు పిల్లలను అదే వీధిలో ఉన్న తన అత్త ఇంట్లో వదిలిపెట్టింది నివేదిత. ఆ తరువాత ప్రియుడిని పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో మంచంపై మంచి రొమాన్స్‌లో ఉన్నారు. ఇంతలో భర్త వచ్చి తలుపులు కొట్టాడు. దీంతో హడావుడిగా తలుపు తీసిన నివేదిత ఎదురుగా భర్త నిలబడి వుండటం చూసి షాకయ్యింది. 
 
భర్త లోపలికి రాగానే యువకుడిని చూశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంతలో నివేదిత ఏమాత్రం ఆలోచించకుండా గదిలో మూలన వున్న రోకలి బండను తీసుకుని భర్త తలపై గట్టిగా కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయాడు భర్త. ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే చనిపోయాడు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.