శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 10 జనవరి 2020 (21:25 IST)

వదినతో అక్రమ సంబంధం.. సొంత అన్నను అతి దారుణంగా చంపి...

వదినను తల్లితో సమానంగా భావిస్తుంటారు. అయితే అతను మాత్రం వదినను బెదిరించి లొంగదీసుకున్నాడు. సంవత్సరన్నర పాటు వదినను బెదిరించి తన కోర్కె తీర్చుకున్నాడు. అయితే విషయం అన్నకు తెలిసింది. తమ్ముడిని కాకుండా భార్యను మందలించాడు అన్న. అయితే ఇది జీర్ణించుకోలేక అతి దారుణంగా అన్నను చంపేశాడు తమ్ముడు. 
 
అక్రమ సంబంధాలు మనుషుల జీవితాలను తల్లకిందులు చేస్తున్నాయి. పచ్చని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకుని తోడబుట్టిన అన్నను హత్య చేసాడు కసాయి తమ్ముడు. శివగంగై జిల్లా ఎస్‌.పుదూర్‌ సమీపాన ముగండపట్టి తువరంకురిచ్చి రోడ్డులో ఒక వంతెన కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విచారణలో మృతుడు వలసైపట్టి గ్రామానికి చెందిన మురుగయ్య మేస్త్రీగా తెలిసింది. 
 
విచారణలో భార్య వివాహేతర సంబంధం కారణంగా మురుగయ్య హత్యకు గురైనట్లు తేలింది. మురుగయ్య భార్య మణిమేగలై , మురుగయ్య తమ్ముడు పిచ్చుమణి మధ్య వివాహేతర సంబంధం ఉంది. దీని గురించి తెలియడంతో మురుగయ్య తన భార్యను మందలించాడు. దీంతో వారి మధ్య ప్రతి రోజు గొడవలు జరిగాయి. 
 
మురుగయ్య ప్రాణాలతో ఉంటే తమ సంబంధం కొనసాగించలేమని, అతన్ని హతమార్చేందుకు మణిమేగలై పిచ్చుమణిలు కుట్ర పన్నారు. మురుగయ్యను ఇంట్లో హత్య చేసి తర్వాత మృతదేహాన్ని ఇద్దరు కలసి వంతెన కింద పడవేసారు. విచారణలో నిందితులు పిచ్చుమణి, మణిమేగలైలని తేలడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. హత్యకు గురైన మురుగయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో వీరి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.