శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 9 జనవరి 2020 (21:58 IST)

నా మొగుడు పడకగదిలోకి రావడం లేదు, భర్తపై భార్య ఫిర్యాదు

భర్త బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తూ తనకు సంసారసుఖం లేకుండా చేశాడని ఓ భార్య సాక్షాత్తు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ ఘటన సంచలనంగా మారుతోంది. అహ్మదాబాద్ నగరంలోని దానిలిండా ప్రాంతానికి చెందిన ఒక మహిళ సర్గేజ్ ప్రాంతానికి చెందిన 25 యేళ్ళ యుకువడిని 2016వ సంవత్సరం మే 14వ తేదీన పెళ్ళి చేసుకుంది.
 
2018వ సంవత్సరంలో తమకు మొదటి బిడ్డ పుట్టాక భర్త తనకు పడక సుఖం లేకుండా చేస్తూ బలవంతపు బ్రహ్మచర్యం పాటిస్తున్నాడని వివాహితన తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు పడకగదిలోకి రమ్మని పిలిస్తే చాలు తన భర్త ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతున్నాడని.. తనను కొడుతున్నాడని భార్య పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తెలిపింది.
 
కొన్ని నెలల కిందట తన కుమారుడికి ఆరోగ్యం బాగా లేకున్నా కనీసం మందులు కూడా కొనివ్వలేదని భార్య ఫిర్యాదు చేసింది. తన భర్త తనను పట్టించుకోవడం లేదని చెప్పడంతో పోలీసులు గృహ హింస చట్టం, వేధింపుల కింద భర్తపై కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.