సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 8 ఆగస్టు 2020 (13:07 IST)

అతడు తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని తనపై నేరాలు మోపి, చివరకు..?

చెన్నైలోని రెడ్ హిల్స్ ఏరియా అది. రౌడీ షీటర్ ఆనంద్ తిరువొత్తియూర్ లోని అప్పర్‌నగర్‌కి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఈ వివాహేతర సంబంధం సాగుతోంది. ఇతడు పలు కేసుల్లో రౌడీషీటర్. 
 
ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్‌తో మహిళ ఇమ్రాన్ అనే యువకుడిని దత్తత తీసుకుంది. తల్లి అక్రమ సంబంధం విషయం ఇమ్రాన్‌కు తెలుసు. అయితే ఆమె తనను దత్తత తీసుకోవడంతో అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. 
 
దీంతో పాటు తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆనంద్ దొంగతనాలు, కిడ్నాప్‌లు చేసి ఆ నేరాలు ఆనంద్ పైన వేసేవాడు. ఇమ్రాన్ మాత్రం ఆ నేరాలను ఒప్పుకుని జైలుకు వెళ్ళేవాడు. ఇలా ఐదు సంవత్సరాల నుంచి నడుస్తోంది. అనాథగా ఉన్న తనను ఆదరించారన్న ఒకే ఒక్క కారణంతోనే ఇమ్రాన్ ఇదంతా చేసేవాడు.
 
కానీ ఆనంద్ పైశాచికత్వం ఎక్కువవడంతో తట్టుకోలేకపోయాడు ఇమ్రాన్. ఎలాగైనా అతన్ని చంపేయాలనుకున్నాడు. ఇమ్రాన్ తల్లి కూడా సహకరించడంతో ఇంట్లోనే అతన్ని రెండురోజుల క్రితం చంపి పక్కనే వున్న సముద్రంలో పడేశాడు. నిన్న ఉదయం మృతదేహం ఒడ్డుకి కొట్టుకురాగా పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో నిందితులిద్దరూ విషయాన్ని ఒప్పుకున్నారు.