సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (18:32 IST)

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వణుకుతున్న చెన్నై జనం

తమిళనాడు, పుదుచ్చేరిలను నివర్ తుఫాను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలను సర్వనాశనం చేసింది. 'నివర్' ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోకముందే చెన్నైలోని భారత వాతావరణ విభాగం మరో హెచ్చరిక జారీ చేసింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ఆదివారం నాటికి బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
 
నివార్ తుపాను పుదుచ్చేరి, పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బంగాళాఖాతంలో పురుడుపోసుకున్న ఈ తుపాను పుదుచ్చేరి వద్ద గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. నివర్ తుపాను కారణంగా తమిళనాడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 1000కిపైగా వృక్షాలు నేలమట్టమయ్యాయి