సోమవారం, 1 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (11:16 IST)

అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్ : హవాలా చట్టం కింద త్యాగి వద్ద ఈడీ విచారణ

అగస్టా హెలికాఫ్టర్ల కొనుగోలు స్కామ్‌లో వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిని ఈడీ ప్రశ్నించింది. హవాలా చట్టం కింద ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు తెలిసింది. 
 
భారత్‌కు అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల అమ్మకం కుంభకోణంలో మిలాన్ (ఇటలీ) కోర్టు కూడా అవినీతి జరిగినట్టు నిర్ధారించిన విషయం తెల్సిందే. దీంతో త్యాగిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. మిలాన్ కోర్టు తీర్పులో పలు అంశాల్లో త్యాగి పేరు కనిపించిందని పేర్కొన్నాయి. 
 
ఈ కేసుతో సంబంధమున్న వ్యక్తులు, అధికారులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈడీ రక్షణమంత్రిత్వ శాఖను, ఆదాయ పన్ను విభాగాన్ని, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ)ను కోరింది. కాగా, ఈ కేసులో కాంగ్రెస్ నేతలకు సైతం సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.