శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (09:43 IST)

యుద్ధ విమానం మిస్సింగ్ కాలేదు.. కూలిపోయింది..13 మంది మృత్యువాత

భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం ఒకటి సోమవారం అదృశ్యమైందనీ వార్తలు వచ్చాయి. అయితే, ఈ విమానం మిస్సింగ్ కాలేదనీ, కూలిపోయినట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ విమానం కూలిపోవడం వల్ల 13 మంది మృత్యువాతపడినట్టు అధికారులు వెల్లడించారు. 
 
అస్సాంలోని జోర్‌హాట్ నుంచి బ‌య‌లుదేరిన ఐఏఎఫ్ విమానం మిస్సైన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో 13 మంది ప్ర‌యాణిస్తున్నారు. ఆంట‌నోవ్ 32 విమానం.. 12.25 నిమిషాల‌కు టేకాఫ్ తీసుకున్న‌ది. అది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మెచూకా ల్యాండింగ్ గ్రౌండ్‌కు వెళ్లాల్సి ఉంది. ఆ విమానం చివ‌రిసారిగా ఒంటి గంట‌కు కాంటాక్ట్ అయ్యింది. ఐఏఎఫ్ విమానం ఆచూకీ కోసం.. సుఖోయ్ 30 యుద్ధ విమానంతో గాలింపు చేప‌డుతున్నారు. 
 
సీ 130 స్పెష‌ల్ ఆప‌రేష‌న్ విమానాన్ని కూడా సెర్చ్ మిష‌న్ కోసం వాడుతున్నారు. ఐఏఎఫ్ ఏఎన్‌-32 విమానం ఎక్క‌డికి వెళ్లింద‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్ 32 విమానం.. భారత్- చైనా సరిహద్దులో నిన్న సాయంత్రమే కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణించిన 8 మంది సిబ్బంది, అయిదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ యేడాదిలో ఇప్పటివరకు ఏఐఎఫ్‌కు చెందిన 11 విమానాలు కూలిపోయినట్లు సమాచారం.