ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (14:41 IST)

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

guliwala
బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత అజాజ్ ఖాన్ భార్య ఫాలన్ గులివాలా (40)ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విదేశీయురాలైన గులివాలా నివాసం ఉండే జోగీశ్వరి ప్రాంతంలోని ఇంట్లో బుధవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు పలు రకాలైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు. 
 
నెల రోజుల క్రితం అజాజ్ ఖాన్ స్టాఫ్ మెంబర్ సూరజ్ 100 గ్రాముల మెఫెట్రోన్‌ను ఆర్డర్ చేసి పోలీసులకు దొరికిపోయిన విషయం తెల్సిందే. అంధేరీ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న అజీజ్ ఆఫీస్ డ్రగ్స్ డెలివరీ కావాల్సి ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు సూరజ్‌ను అరెస్టు చేసి నార్కోటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
పార్సిల్ తన పేరున ఉన్నప్పటికీ అజాజ్ మేనల్లుడు ఫర్హాన్ వాటిని ఆర్డర్ చేసినట్టు విచారణలో సూరజ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో జోగేశ్వరిలోని అజాజ్ ఖాన్ భార్య ఫాలన్ అజాజ్ గులివాలా పేరున ఉన్న ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు.
 
గులివాలా నివాసంలో నిర్వహించిన సోదాల్లో 136 గ్రాముల చరాస్, 33 గ్రాముల మెఫెడ్రోన్ ఖాళీ పౌచ్‌లు, 28 గ్రాముల మెఫెడ్రోన్ మాత్రలు, ఇతర మత్తు పదార్థాలు, రూ.11 లక్షల నగదు లభించాయని, దీంతో ఆమెను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. భార్య అరెస్ట్ నేపథ్యంలో ఇప్పుడు అజీజ్ ఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. 
 
2021లో అజాజ్ 4.5 గ్రాముల బరువున్న 31 అల్ట్రాజోలమ్ ట్యాబ్లెట్స్తో దొరికిపోయాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన 26 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత వెర్సోవా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగిన అజాజ్కు కేవలం 155 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.