మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (16:58 IST)

యూపీలో రాజకీయ సంక్షోభం: అమర్ సింగ్ బ్రోకర్.. జయప్రద పదవి గోవిందా..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన కేబినెట్ నుంచి శివపాల్‌తో పాటు మరో ముగ్గుర్ని బహిష్కరించిన నేపథ్యంలో యూపీలో రాజకీయసంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం అఖిలేష్ యాదవ్‌కు 183 మంది

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన కేబినెట్ నుంచి శివపాల్‌తో పాటు మరో ముగ్గుర్ని బహిష్కరించిన నేపథ్యంలో యూపీలో రాజకీయసంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం అఖిలేష్ యాదవ్‌కు 183 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుండగా, ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్‌కు 46 మంది సపోర్ట్ చేస్తున్నారు.
 
ఇక ఉత్తరప్రదేశ్ రాజకీయ సంక్షోభం సెగ జయప్రదకు కూడా తగిలింది. ఉత్తరప్రదేశ్ చలనచిత్ర వికాస్ పరిషత్ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ఆమెను తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పదవి నుంచి తొలగిస్తూ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నటిగానే కాకుండా యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. అమర్ సింగ్ సన్నిహితురాలిగా మంచి మార్కులు కొట్టేసిన జయప్రదకు అఖిలేష్ మంగళం పాడేశారు. 
 
సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు ఆప్తుడుగా ఉండటంతో పాటు, తాజా రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారకుడు అమర్ సింగేనని అఖిలేష్ గుర్రుగా ఉన్నారు. అందుకే అమర్ సింగ్‌ను అఖిలేష్ బ్రోకర్ అని విమర్శించడం వంటి పరిణామాల నేపథ్యంలో జయప్రద పదవి ఊడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.