శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (09:46 IST)

ఢిల్లీలో దారుణం : అమెరికా యువతిపై గ్యాంగ్ రేప్.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో...

ఢిల్లీలో దారుణం జరిగింది. అమెరికా యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. కనాట్‌ ప్లేస్‌ సమీపంలో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో అమెరికాకు చెందిన ఓ యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పా

ఢిల్లీలో దారుణం జరిగింది. అమెరికా యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. కనాట్‌ ప్లేస్‌ సమీపంలో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో అమెరికాకు చెందిన ఓ యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితుల్లో టూరిస్ట్‌ గైడ్‌ ఉన్నాడు. గత మార్చిలో జరిగిన ఈ దారుణం గురించి బాధితురాలు ఈమెయిల్‌ ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి వాంగ్మూలం ఇస్తానని పేర్కొంది.
 
ఈ మెయిల్‌‌లో తెలిపిన వివరాలమేరకు.. గత మార్చిలో అమెరికన్‌ యువతి టూరిస్ట్‌ వీసాపై ఢిల్లీ వచ్చింది. కనాట్‌ ప్లేస్‌ దగ్గరలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో బసచేసింది. హోటల్‌ సిబ్బంది సూచనమేరకు ఏ ఏజెన్సీకి చెందిన టూరిస్ట్‌ గైడ్‌‌ను నియమించుకుంది. ఆమె హోటల్‌ గదిలో ఉన్న సమయంలో రూట్‌ప్లాన్‌ గురించి మాట్లాడాలంటూ గైడ్‌ మరో నలుగురితో కలసి వచ్చాడు. ఆమెకు బలవంతంగా డ్రింక్ తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
ఈ దారుణం జరిగిన తర్వాత బాధితురాలు వెంటనే భారత్‌ నుంచి అమెరికా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులకు చెప‍్పకుండా ఈ విషయాన్ని దాచింది. డిప్రెషన్‌‌కు గురైన బాధితురాలు కొన్ని నెలల తర్వాత తన స్నేహితురాలైన లాయర్‌‌ను సంప్రదించింది. లాయర్‌ సలహా మేరకు భారత్‌ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ ఎన్జీవోను సంప్రదించింది. వారి ద్వారా ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌‌కు ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును కనాట్‌ ప్లేస్‌ పోలీసు స్టేషన్‌‌కు బదిలీ చేశారు. విచారణ చేపట్టామని, గైడ్‌‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. హోటల్‌ సిబ్బందిని, గైడ్‌ పనిచేసే ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.