శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

జయలలితకు చెందిన వస్తువులన్నీ మాయం.. ఏమయ్యాయి?

అక్రమ సంపాదన కేసుల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో దాదాపుగా 28 రకాల వస్తువులు మాయమైపోయాయి. వీటిని ఎవరు చోరీ చేశారో.. ఎవరు మాయం చేశారో తెలియడం లేదు. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు మినహా మిగిలిన వస్తువులన్నీ కనిపించడం లేదు. ఈ మేరకు తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు కర్నాటక ప్రభుత్వ న్యాయవాది ఓ లేఖ రాశారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత నుంచి గత 1996లో 30 కేజీల బంగారం, వజ్రాభరణాలు సహా అనేక రకాలైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీటిలో రెండు రకాల వస్తువులు మినహా 28 రకాల ఖరీదైన వస్తువులు మాయమైనట్టు కర్నాటక ప్రభుత్వ న్యాయవాది లేఖ రాశారు. 
 
జయలలితకు చెందిన 11344 ఖరీదైన చీరలు,250 శాలువాలు,750 జతల పాదరక్షకలు, గడియారాలు, తదితర 28 రకలా వస్తువులు జాడ లేదని, అవెక్కడున్నాయో తెలియదని అందులో పేర్కొన్నారు. అవి కనుక మీ ఆధీనంలో ఉంటచే వాటిని కర్నాటక కోర్టులో అప్పగించాలని కోరారు. బెంగుళూరు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ వస్తువులు వేలానికి వేయనున్నారు.