గీత సాక్షిగా ఓ అబ్బాయా.. సాంగ్ ను మెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma launch song
యువకులు అమ్మాయిలపై తమ ప్రేమను, వ్యామోహాన్ని వ్యక్తం చేసే పద్ధతులెన్నో.. అందులో పాటలు కూడా ఉంటాయి. అదే అమ్మాయిలు అబ్బాయిలపై తమ ఇష్టాన్ని, ప్రేమను, వ్యామోహాన్ని పాట రూపంలో వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా! ఆ కిక్ మరో రేంజ్‌లో ఉంటుందనటంలో సందేహమే లేదు. మన సినిమా హిస్టరీలో ఈ స్టైల్ ఆఫ్ సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌లో టాప్‌లో నిలిచి ఓ ఊపు ఊపేశాయి.. ఇప్పటికీ ఆ పాటలను మనం హమ్ చేసుకుంటూనే ఉంటాం. అలాంటి మరో సాంగ్ ఆడియెన్స్ మనసుని గిలిగింతలు పెట్టడానికి మన ముందుకు వచ్చేసింది. అబ్బా అబ్బా ఓ అబ్బాయా.. అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ కుర్రకారు మనసుని కవ్వించేస్తుంది. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోనో తెలుసా.. గీత సాక్షిగా...
PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ నటీ నటులుగా ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో చేతన్ రాజ్ నిర్మిస్తోన్న సినిమా గీతా సాక్షిగా. నిజ జీవిత సంఘటనల ఆధారంగ తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి శుక్రవారం రోజున అబ్బా అబ్బా ఓ అబ్బాయా.. అనే సాంగ్‌ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్బా అబ్బా ఓ అబ్బాయా.. సాంగ్ చాలా క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా చాలా బావున్నాయి. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. అందరికీ నచ్చేలా సాంగ్ ఉంటుందని కచ్చితంగా చెప్పగలను అన్నారు.
శ్రీకాంత్ అయ్యంగార్ అబ్బా అబ్బా ఓ అబ్బాయా.. సాంగ్‌ను వర్మగారు రిలీజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు పాట చాలా బాగా నచ్చింది. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం అన్నారు.
సెకండ్ లిరికల్ సాంగ్‌గా విడుదలైన అబ్బా అబ్బా ఓ అబ్బాయా.. సాంగ్‌ను విడుదల చేసి సపోర్ట్ చేసిన ఆర్జీవీకి చిత్ర యూనిట్ ధన్యవాదాలను తెలియజేసింది.
గోపీ సుందర్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని పాటను రెహమాన్ రాయగా.. సాహితీ చాగంటి హస్కీ వాయిస్‌లో పాడిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్స్, టీజర్‌లతో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీతో పాటు సినిమాపై హైప్ పెరిగింది. ఇప్పుడు రిలీజైన అబ్బా ఓ అబ్బాయా.. సాంగ్‌తో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. వెంకట్ హనుమ నరిసేటి సినిమాటోగ్రఫీగా , కిషోర్ మద్దాలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.