సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల వర్మ వెరైటీ కామెంట్.. వాళ్లిద్దరూ స్వర్గంలో..
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే వివాదాలను వెంటబెట్టుకుని తిరిగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల భిన్నంగా స్పందించాడు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల దర్శకుడు రాం గోపాల్ వర్మ భిన్నంగా స్పందించారు. ఆయన మృతి పట్ల ప్రముఖులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంటే వర్మ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు.
ఇప్పటికే కృష్ణ గారు స్వర్గంలో విజయనిర్మలను కలిసివుంటారని.. స్వర్గంలో వారు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారని చెప్పుకొచ్చారు. దీంతో అంతేకాకుండా 'మోసగాళ్లకు మోసగాళ్లు' చిత్రంలో కృష్ణ, విజయనిర్మల 'కోరినది నెరవేరినది' పాటను షేర్ చేశారు.