శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (12:33 IST)

పాక్ ఓటమిపై షమీ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన షోయబ్ అక్తర్

Shoaib Akhtar
ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. ఈ ఓటమిపై భారత బౌలర్ మహ్మద్ షమీ స్పందిస్తూ.. "దీన్నే కర్మ" అని అంటారంటా ట్వీట్ చేశారు. దీనికి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. కర్మను పాకిస్థాన్ తిప్పికొట్టిందన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. 
 
"దీన్ని సెన్సిబుల్ ట్వీట్ అంటారు" అంటూ పాకిస్థాన్ బౌలింగ్ బలం గురించి భారత కామెంటేటర్ హర్ష భోగ్లే చేసిన ట్వీట్‌న ఆయన ఫోటోతో కలిసి అక్తర్ ట్వీట్ చేశారు. "పాకిస్థాన్‌కు క్రెడిట్ ఇవ్వాలి. ఆ జట్టు చేసిన విధంగా 137 పరుగుల లక్ష్యాన్ని కొన్ని ట్లు మాత్రమే కాపాడుకున్నాయి. బెస్ట్ బౌలంగ్ టీమ్ ఇది" అంటూ భోగ్లో ట్వీట్ చేయగా, దీన్ని అక్తర్ ట్యాగ్ చేసి మహ్మద్ షమీకి కౌంటర్ ఇచ్చాడు.