శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (17:29 IST)

అందమైన అమ్మాయి ఫోటో చూసి అప్రోచ్ అయ్యాడు, డబ్బులు లాక్కుని చివరకు..!

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపురం పోలీసులు ఈమధ్య ఒక కేసును ఛేదించారు. అందమైన అమ్మాయిల ఫోటోలతో యువకులను మోసం చేసే ముఠా గుట్టు రట్టు చేశారు. ఆ ముఠా బాగోతం బయటపడటం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.
 
మ్యాట్రిమొని పేరుతో ఒక వెబ్ సైట్ క్రియేట్ చేసి అందులో ఐదుగురు అందమైన అమ్మాయిల ఫోటోలను పెట్టారు ఒక ముఠా. ముఖ్యంగా కోలార్‌కు చెందిన లక్ష్మి... అలాగే ఆమె స్నేహితులు నలుగురు కలిసి మరో నలుగురు యువతుల ఫోటోను తీసుకుని మ్యాట్రిమొనిలో పెట్టారు.
 
అందరూ అందమైన అమ్మాయిలే. దీంతో యువకులు ఎగబడ్డారు. పెళ్ళి విషయం కోసం ఫోన్ చేస్తే ఇక ఫోన్లో ఆ విషయం తప్ప మిగిలిన అన్ని విషయాలను యువతలు మాట్లాడేవారు. దీంతో యువకులు రెచ్చిపోయి ఇక గంటల తరబడి ఫోన్లో మట్లాడుతూనే ఉండిపోయేవారు.
 
ఇలాంటి సమయంలో లక్ష్మి అనే యువతి మాత్రం పరమేష్ అనే వ్యక్తితో పరిచయం పెట్టుకుని చివరకు అతని నుంచి 6 లక్షల దాకా వసూలు చేసేసింది. పరమేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. లక్ష్మి మోజులో పడి డబ్బులంతా అప్పజెప్పాడు. పెళ్ళి విషయం చెబితే మాత్రం మళ్ళీమళ్ళీ అంటూ చెబుతూ వచ్చింది లక్ష్మి. 
 
వెబ్‌సైట్ గురించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. తనతో పాటు ఇంకా ఎంతోమంది యువకులు ఇలాగే మోసపోతున్నారని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. లక్ష్మితో పాటు మరో నిందితుడిని కోలార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు.