శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (23:16 IST)

పూజ గదిలో గంటను ఏర్పాటు చేయకూడదా?

పూజ గదిలో గంటను ఏర్పాటు చేయకూడదా? అంటే చేయకూడదనే సమాధానమే వస్తుంది. పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగత ధ్యానానికి, పూజకు ఉద్దేశించింది. కనుక పెద్ద శబ్దాలు లేకుండా పూజగది వుండాలి. 
 
పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. అలాగే పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులవవుతుంది
 
పూజ గదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పెట్టడం సరికాదు. చాలామంది పెద్దలకు గౌరవం చూపిస్తున్నామనే భావనతో పెడుతున్నామనుకుంటారు కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాదు బాధాకరమైన జ్ఞాపకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు. పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.