శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (19:49 IST)

నల్లబడిపోతున్నారా? ఐతే ఇలాచేయండి..

నల్లబడిపోతున్నారా? చర్మం కాంతి తగ్గిపోయిందా? అయితే ఇలా చేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముందుగా నీటిని ఎక్కువగా తాగడం చేయాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ వంటల్లో వెల్లుల్లి వుండేలా చూసుకోవాలి. నల్లద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు అధికంగా తీసుకోవాలి.
 
నల్ల ద్రాక్ష గుజ్జుకు కాస్త తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని.. ఆ తర్వాత చన్నీళ్లతో స్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది.
 
కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్ కలిపి బాగా పేస్టులా రుబ్బుకుని.. అందులో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖాని రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడిగేసుకుంటే.. చర్మం మెరిసిపోతుంది.