శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (13:42 IST)

ఇన్‌స్టాలో పవర్ స్టార్ రికార్డ్.. పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్‌కు...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాలో రికార్డును నమోదు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్… చేసినవి తక్కువ సినిమాలే అయినా జనాల్లో ఉన్న క్రేజ్ మాములుగా లేదనే విషయం తెలిసిందే. తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ ద్వారా ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇప్పుడు మరో ఫ్లాట్ ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ పేరును హోరెత్తించారు.
 
పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఏకంగా 1 మిలియన్ పోస్టులు వేసి రికార్డు నెలకొల్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తరువాత వకీల్ సాబ్ సినిమాతో కెమెరా ముందుకు వచ్చి ముఖానికి రంగేసుకున్నారు. 
 
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమానే కాకుండా క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకు కూడా ఒకే చెప్పాడు పవన్. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన వకీల్ సాబ్ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.