ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (11:36 IST)

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు..

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఓ ఢిల్లీ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆతనిపై ఆరోపణలు వున్నాయి. 2017లో ఇదే కేసులో అరెస్టయిన మహేష్ మూర్తి.. గం

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఓ ఢిల్లీ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆతనిపై ఆరోపణలు వున్నాయి.

2017లో ఇదే కేసులో అరెస్టయిన మహేష్ మూర్తి.. గంటల్లో బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. 
 
ఏప్రిల్ నుంచి అతని ద్వారా వేధింపులు అధికం కావడంతో శుక్రవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌సీడబ్ల్యూ ఆదేశాలతో 2017 డిసెంబర్‌ 30న కేసు నమోదైంది. దాంతో శుక్రవారం సాయంత్రం మహేష్ మూర్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సెక్షన్స్‌ 354(డీ), 509 కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ రామ్‌చంద్ర జాదవ్‌ చెప్పారు.