శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (14:52 IST)

రాత్రికి రాత్రే మోడల్‌గా మారిపోయిన చాయ్ వాలా... అమ్మాయిలంతా ఎగబడుతున్నారు.. ఎందుకంటే...

పాకిస్థానీ నీలికళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో హీరోగా మారిపోయాడు. ఇస్లామాబాద్‌లో ఓ మూలన టీ అమ్ముకునే అర్షద్‌ ఖాన్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోవడంతో ఒక్కసారిగా అతని రేంజే మారిపోయ

పాకిస్థానీ నీలికళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో హీరోగా మారిపోయాడు. ఇస్లామాబాద్‌లో ఓ మూలన టీ అమ్ముకునే అర్షద్‌ ఖాన్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోవడంతో ఒక్కసారిగా అతని రేంజే మారిపోయింది. అమ్మాయిలు అతనంటే పడిచస్తున్నారు. అతడి ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్‌ చేసుకుంటున్నారు. దాంతో నిన్నమొన్నటి వరకు చాయ్‌ అమ్ముకున్న ఈ 18 ఏళ్ల కుర్రాడిని ఏకంగా మోడలింగ్‌ చాన్స్‌ వరించింది. 
 
ప్రముఖ దుస్తుల కంపెనీకి మోడలింగ్‌ బ్రాండ్‌గా నియమించుకుంది. ఓరచూపుతో చాయ్‌ కాస్తున్న అర్షద్‌ ఫొటో తీసి.. జియా అలీ అనే ఫొటోగ్రాఫర్‌ సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇతను చాలా అందంగా ఉంటాడు. ఎవరైనా మోడలింగ్‌లో అవకాశం ఇవ్వండి.. అని రాసింది. అంతే, అక్కడి నుంచి అర్షద్‌ జీవితమే మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే మోడలింగ్ స్టార్‌గా ఎదిగిన ఈ కుర్రాడి ముందు ఇప్పుడు అందమైన అమ్మాయిలు క్యూ కడుతున్నారు. సరికొత్త గెటప్‌లో దర్శనమిచ్చి అందాల మోడల్స్‌తో కలసి ర్యాంప్ వాక్ చేస్తున్నాడు. పాకిస్థాన్‌లోనే అత్యంత పాపులర్ అయిన టాక్ షో 'గుడ్ మార్నింగ్ పాకిస్థాన్'లో అర్షద్ చోటు దక్కించుకున్నాడు. 
 
దీనికోసం సరికొత్త స్టయిలిష్ లుక్‌తో కనిపించేందుకు తన వంతు కృషి చేయగా, ఆ చిత్రాలిప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అర్షద్ చిత్రాలు బయటకు వచ్చాక పలు కంపెనీలు ఇప్పుడతన్ని ప్రచారకర్తగా నియమించుకునేందుకు పోటీపడుతున్నాయి. ''ఫిటిన్‌.పీకే'' అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌కి మోడల్‌గా వ్యవహరిస్తున్నాడు. అర్షద్‌ సూటూ బూటూ వేసుకున్న ఫొటోతో అతను చాయ్‌వాలా నుంచి ఫ్యాషన్‌ వాలాగా మారిపోవడం మరింత వైరల్‌ అవుతోంది. 
 
ఒక్క ఫోటోతో ఇంత పాపులారిటీ వస్తుందని అనుకోలేదని చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉందని అర్షద్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అర్షద్‌ ఫొటో సోషల్‌మీడియాలోకి రాగానే అతను పాక్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌గా మారిపోయాడు. తన ఫొటోలుమరిన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయమని అభిమానులు అడగడంతో అతను తన మోడలింగ్‌ ఫొటోలను పోస్ట్‌ చేశాడు.