కేరళలో మంకీ ఫీవర్.. 24 ఏళ్ల యువకుడికి పాజిటివ్
గతంలో కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపింది. ప్రస్తుతం కేరళలో మంకీ ఫీవర్ వెలుగులోకి వచ్చింది. కేరళ వయనాడ్ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్ లక్షణాలు ఉండగా.. వైద్య పరీక్షలు చేశారు.
అనుకున్నట్లే అతనికి మంకీ ఫీవర్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అతనికి మనంతవాడీ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఏడాది కేరళలో మంకీ ఫీవర్ కేసు నమోదవడం ఇదే తొలిసారి. అయితే రెండేళ్ల క్రితం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ మండలం అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్‌తో 26 మంది మృతి చెందారు.