బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (14:32 IST)

కేరళలో కరోనా విజృంభణ.. ఆదివారాలు లాక్డౌన్

కేరళలో కరోనా విజృంభిస్తోంది. మూడో వేవ్‌తో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 50వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 20న కేరళలో అత్యధిక స్థాయిలో రోజువారీ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 
 
రోజువారీ టెస్టుల్లో పాజిటివిటీ రేటు 40 శాతం దాటింది. కోవిడ్ టెస్టుల సంఖ్య పెరిగాయి. రాష్ట్రంలో 46,387 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,15,357 కరోనా పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ రేటు 40.21 శాతంగా నమోదైంది.  
 
కేరళ రాష్ట్రంలో మొత్తం 32 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో.. కేరళ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వచ్చే రెండు ఆదివారాలు (జనవరి 23, 30) పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది.
 
అన్ని తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. 10, 12వ తరగతి విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలల్లో తరగతులు ఉండవు.