శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (11:31 IST)

అందరినీ సమానంగా చూస్తా.. వర్గ వివక్ష చూపబోను... యోగి.. ఎందుకు వెక్కివెక్కి ఏడ్చారు?

హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఆయనను సీఎంగా బీజేపీ ఎంచుకోవడంపై పలు విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుత

హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఆయనను సీఎంగా బీజేపీ ఎంచుకోవడంపై పలు విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం తాను అందరినీ సమానంగా చూస్తానని, ఏ వర్గంపైనా వివక్ష చూపబోనని యోగి తెలిపారు. తమ ఎన్నికల నినాదమైన 'సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌' (అందరికీ చేయూత, అందరికీ ప్రగతి) నేరవేరుస్తానని హామీ ఇచ్చారు. 
 
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యోగి వెక్కి వెక్కి ఏడ్చిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆదివారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం చేస్తుండగా ఈ ఘట్టాన్ని ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు పదేళ్ల కిందట జరిగిన ఘటన గుర్తు చేసుకుని వుండాలి. అప్పుడు అధికారంలో ఉన్న ములాయం ప్రభుత్వం 11 రోజులపాటు యోగిని జైల్లో పెట్టింది. దీంతో బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన సాక్షాత్తు పార్లమెంటులోనే వెక్కివెక్కి ఏడ్చారు. వీడియోను నెటిజన్లు నెట్లో పోస్ట్ చేసి, షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు.