మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ : 11 మంది ఎన్‌కౌంటర్
గత కొంతకాలంగా మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోతుంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 11 మంది ప్రాణాలు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగింది.
బీజాపూర్ జిల్లా బారేడు అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సర్స్‌క మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. దీంతో ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులకు తారసపడటంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి పోలీసులు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.