మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:17 IST)

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

karunanidhi
తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే మంగళవారం చెన్నై మహానగరంలో ముప్పెరు విళాను నిర్వహించింది. ఇందులో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ వేడుకకు ప్రత్యక్షమైన వారంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ చనిపోయిన తమ నేత ఈ వేడుకలకు ఎలా ప్రత్యక్షమయ్యారంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోవడ జరిగింది. 
 
చెన్నైలోని నందనం వైఎంసీఏ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వేదికపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పక్కన వేసిన ఆసనంలో ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా దివంగత ముఖ్యమంత్రి కరుణానిధిని సృష్టించారు. ఏఐ కరుణానిధి మాట్లాడుతూ పెరియార్‌ లక్ష్యాన్ని, అన్నాదురై మార్గాన్ని, తాను కాపాడిన పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన స్టాలిన్‌ను తలచుకుని హృదయం గర్విస్తోందన్నారు. నిమిషం పాటు సాగిన ఈ ప్రసంగం కార్యకర్తలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.