శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (16:48 IST)

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం బీభత్సం-చిక్కుకున్న 57మంది.. 15మంది సేఫ్

Uttarakhand
Uttarakhand
ఉత్తరాఖండ్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ హిమపాతం కారణంగా 57 మంది కార్మికులు మంచు చరియల కిందనే చిక్కుకుపోయారని తెలుస్తోంది. వారిలో 15మందిని సహాయక బృందాలు కాపాడాయి. మిగతా వారిని రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మంచు దట్టంగా కురుస్తుండడంతో రెస్క్యూ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
సైనికుల కోసం వేస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడి మంచును కార్మికులు తొలగిస్తున్న సమయంలో హిమపాతం వారిని ముంచేసింది. ఈ ప్రాంతంలో ఐటీబీపీ, బీఆర్వో, ఇతర రెస్క్యూ టీమ్‌లు రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నాయి. బద్రీనాథ్‌కు దగ్గరలోని మనా గ్రామంలోని బీఆర్వో శిబిరానికి సమీపంలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా అధిగమించి బాధితులను రక్షించేందుకు ఆర్మీ, ఎస్‌డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు ఆపరేషన్ సాగిస్తున్నట్టు ఉత్తరాఖండ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి, ఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. మరోవైపు,మంచు చరియలు విరిగిపడుతుండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.