శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (12:46 IST)

పగటి పూట భిక్షాటనం... రాత్రిపూట హోటళ్లలో బస!

ఆ మహిళలు బ్రాండెడ్ టీ-షర్టులు, బూట్లు వేసుకుంటారు.. రాత్రిపూట విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తారు.. పగటి పూట వారు చేసేది మాత్రం భిక్షాటనం.. అవును.. పగలంతా రోడ్ల పక్కన అడుక్కుని, ఆ డబ్బుతో విలాసంగా గడుపుతుంటారు.. ఎవరైనా డబ్బుల వేయడానికి నిరాకరిస్తే వారిని బెదిరించి దౌర్జన్యంగా లాక్కుంటారు.
 
ఎనిమిది మంది ఉన్న మహిళల ముఠాను కాన్పూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వారితో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. గుజరాత్‌కు చెందిన ఈ గ్యాంగ్ సభ్యులు రాజస్తాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ దందా కొనసాగిస్తున్నారని కాన్పూర్ పోలీస్ కమిషనర్ చెప్పారు.

పగలంతా అడుక్కునే వీరు రాత్రిపూట మంచి హోటళ్లలో బస చేస్తారని, ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే వారిని ఎనిమిది మంది కలిసి కొడతారని చెప్పారు. ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నామని తెలిపారు.