సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (07:43 IST)

అమ్మను చంపి.. రోజుకు కొంత చొప్పున తినేసిన కుమారుడు

సొంత తల్లిని హతమార్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి, 15 రోజులపాటు ఫ్రిజ్‌లో పెట్టుకొని తిన్నాడో కుమారుడు. కన్నపేగు ప్రేమను మరచిపోయి కసాయిగా ప్రవర్తించిన అతన్ని పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు.

ఈ ఘటన 2019 ఫిబ్రవరిలో జరిగింది. స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌కు చెందిన ఆల్బర్టో సాంచెజ్ గోమెజ్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతోపాటు అపార్ట్‌మెంటులో ఉంటున్న తల్లిని అతను హతమార్చాడు.

ఆపై ముక్కలుగా నరికి రోజుకు కొంత చొప్పున తినేశాడు.  తనకు ఆ సమయంలో మానసిక స్థితి సరిగా లేదని, సైకాటిక్ ఎపిసోడ్‌లో ఉన్నానని ఆల్బర్టో కోర్టుకు తెలిపాడు.

ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.