సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (09:25 IST)

ప్రేమించలేదని కోపంతో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

ప్రేమించలేదని కోపంతో యువతి గొంతు కోసేశాడు ఓ ప్రేమోన్మాది. ఆ తర్వాత తను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరం సాంబయ్యకండ్రిగలో చోటు చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న యువకుడిపై యువతి బంధువులు రాళ్లతో దాడి చేశారు.
 
గతంలో పోలీసులు కౌన్సిలింగ్ చేసిన ఫలితం లేకుండా పోయింది ఉన్మాదిగా మారిన యువకుడు యువతిని హత్యచేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
చిత్తూరు నగరంలోని సాంబయ్యకండ్రిగ హౌసింగ్ కాలనీకి చెందిన వరదయ్య కుమార్తె సుస్మిత గుడిపాల మండలంలోని చీలాపల్లి సియంసి ఆసుపత్రిలో స్టాప్ నర్సింగ్‌గా పనిచేస్తుంది. ఇదే కాలనీకి చెందిన చిన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో సుస్మితను ప్రేమించమని వేధించేవాడు. గతంలో సుస్మిత చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సిలింగ్ చేసి పంపించారు. గత మూడు రోజుల క్రితం సుస్మిత పని చేస్తున్న సీఎంసి హాస్పిటల్ వద్ద ఉన్న తనను ప్రేమించమని గొడవ చేశాడు.
 
సుస్మిత గుడిపాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు చిన్న సుస్మిత వాళ్ళ మేడపై నుండి ఇంటిలోకి‌ దిగి ఒంటరిగా ఉన్న సుస్మితపై కత్తితో దాడి చేశాడు.