సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (13:38 IST)

హెల్మెట్లు పెట్టుకుని విధులు నిర్వహించాలంటూ సర్కారు ఆదేశం.. ఎక్కడ?

bus drivers wear helmets
ఒక మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వేళ వీటిని నిజం చేసేలా ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య ఆస్పత్రిలో జూనియర్ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మగంళవారం కోల్‌కతాలో విద్యార్థులు మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అది కాస్తా హింసాత్మకంగా మారింది. అటు పోలీసులు, ఇటు నిరసనకారులు గాయాలపాలయ్యారు. వీటిని చెదగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లతో పాటు టియర్ గ్యాస్‌లను ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల చర్యను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ 12 గంటల రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. 
 
ప్రజలంతా స్వచ్ఛంధంగా బంద్‌లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. అయితే, ఈ బంద్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా బంద్‌ను విఫలం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో బంద్ సందర్భంగా విధుల్లో పాల్గొనే రవాణా కార్మికులైన డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో హెల్మెట్లు ధరించి విధులు నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా అన్ని బస్ డిపోలలో ఉన్నతాధికారులు ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు హెల్మెట్లు అందజేయడంతో వాటిని ధరించి బస్సులను నడుపుతున్నారు. విధులు చేపట్టే ముందు ప్రభుత్వ అధికారులో స్వయంగా ఈ హెల్మెట్లు అందజేసి, వాటిని ధరించి విధులు నిర్వహించాలంటూ ఆదేశించారని తెలిపారు.